Lulu Mall Gun Incident | లులు మాల్‌లో గన్ కలకలం.. కేసు నమోదు

కేపీహెచ్​బీలో గల లులు మాల్‌లో గన్ కలకలం రేగింది. ఓ వ్యక్తి లైసెన్స్​ ఉన్న గన్​తో మాల్​లోకి ప్రవేశించాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Lulu Mall Gun Incident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలోని కేపీహెచ్​బీలో గల లులు మాల్‌లో గన్ కలకలం రేగింది. మాల్ పార్కింగ్ వద్ద రెండు కుటుంబాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు అక్కడకు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు.

మాల్​లోని సెల్లార్​లో పార్కింగ్ ప్రాంతంలో ఓల్డ్‌సిటీకి చెందిన రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దీంతో మాల్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయిస్తుండగా.. పాతబస్తీకి చెందిన సిద్ధిఖీ జేబులో తుపాకీని గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకొని పరిశీలించారు. అయితే ఆ గన్​కు లైసెన్స్​ ఉన్నట్లు గుర్తించారు. లైసెన్స్​ ఉన్నా.. గన్​తో మాల్​లోకి వెళ్లకూడదు. అయితే భద్రతా సిబ్బంది తనిఖీలు చేయకపోవడంతో గన్​తో లోపలికి వెళ్లినట్లు గుర్తించారు.

Lulu Mall Gun Incident | యాజమాన్యంపై కేసు

లులు మాల్​ ప్రవేశ మార్గంలో మెటల్ డిటేక్టర్​, బ్యాగ్​ స్కానింగ్​ ఉంటాయి. సరైన తనిఖీలు చేసిన తర్వాతే వినియోగదారులన లోనికి అనుమతించాలి. అయితే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయకపోవడంతో సిద్దిఖీ గన్​తో లోపలికి వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు లులు మాల్​ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.

ఇది కూడా చదవండి..: SI Pujari Suspension | మైనర్ డ్రైవింగ్‌కు ప్రోత్సాహం.. ఎస్సై పూజారి తిరుపతిపై సస్పెన్షన్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *