అక్షరటుడే వెబ్‌డెస్క్: Germany Dating App | సాధారణంగా 68 ఏళ్ల వయసులో ప్రశాంతంగా జీవించాల్సిన వృద్ధుడొకరు, జర్మనీలో అమానుషమైన చర్యలకు పాల్పడ్డాడు. ఆన్లైన్ డేటింగ్ యాప్‌లను వాడుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని, మత్తుమందు ఇచ్చి లైంగిక దాడులకు పాల్పడిన ఘటనపై జర్మన్ ప్రాసిక్యూటర్లు అధికారికంగా చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
Germany Dating App | మత్తుమందు ఇచ్చి..
బెర్లిన్‌కు చెందిన ఈ వృద్ధుడు ఆన్లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ( Online Dating ) ద్వారా మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. వారిని బుట్టలో వేయడానికి తియ్యటి మాటలు చెప్పి, ఎలాగైనా సరే తనను కలవాలని ఒత్తిడి చేసేవాడు. బాధితులు తనను కలిసినప్పుడు, వారికి ఇచ్చే ఆల్కహాల్ లేదా పానీయాలలో నిద్రమాత్రలు కలపడం లేదా మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి వారిని స్పృహ కోల్పోయేలా చేసేవాడు. బాధితులు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆ సమయంలో బాధితులకు ఏమీ తెలియకపోవడంతో, వారికి జరిగిన అఘాయిత్యం గురించి కనీసం అవగాహన కూడా ఉండేది కాదు.
Germany Dating App | పోలీసుల దాడుల్లో బయటపడిన సాక్ష్యాలు..
మరో కేసు విచారణలో భాగంగా పోలీసులు నిందితుడి నివాసంపై ఆకస్మికంగా దాడులు చేశారు. ఈ సోదాల్లో పోలీసులకు లభించిన పెన్‌డ్రైవ్‌లు వారిని విస్మయానికి గురిచేశాయి. అందులో సదరు మహిళలపై నిందితుడు చేసిన దాడుల వీడియోలు రికార్డయి ఉన్నాయి. వాటిని చూస్తూ నిందితుడు వికృతానందం పొందేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Germany Dating App |58 మంది వరకు బాధితులు ..
ప్రస్తుతం నిందితుడిపై 14 మంది మహిళలపై జరిగిన 22 అత్యాచార ఘటనలకు సంబంధించి కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, కేసులో లోతైన దర్యాప్తు చేస్తున్న ప్రాసిక్యూటర్లకు మరో షాకింగ్ విషయం తెలిసింది. ఈ కేసులో బాధితుల సంఖ్య 58 వరకు ఉండే అవకాశం ఉందని వారు అనుమానిస్తున్నారు. ఈ ఉదంతం డేటింగ్ యాప్‌లను వాడే యువతీ యువతులకు కళ్లు తెరిపించేలా ఉంది. సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌ల ద్వారా కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Indian Stock Market | భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు