అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mudragada Padmanabham | ఆంధ్రప్రదేశ్‌లో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు.
తూర్పు గోదావరి (East Godavari) జిల్లాకు చెందిన ముద్రగడ ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేశారు. గతంలో ఆయన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీల్లో పని చేశారు. 2024 ఎన్నికల సమయంలో వైసీపీ (YCP)లో చేరారు. ప్రస్తుతం అదే పార్టీలో కొనసాగుతున్నారు. ముద్రగడ 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.
Mudragada Padmanabham | కాపు ఉద్యమంతో..
ముద్రగడ 1978 నుంచి రాజకీయాల్లో ఉన్నా.. కాపు ఉద్యమంతో ఆయనకు రాష్ట్రంలో పేరు వచ్చింది. 1994లో కాపుల కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. కాపు విద్యార్థులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తూ జీవో జారీ చేయించారు. 2016 తుని ఘటనతో కాపు ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ ఆందోళన సమయంలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది. ఆయన 2024 ఎన్నికల ప్రచార సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడిస్తానని సవాల్ చేశారు. తాను ఓడిపేత పేరును మార్చుకుంటానని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ గెలవడంతో ముద్రగడ తన పేరును పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. శ్వాసకోశ వ్యాధితో హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
దీనిని కూడా చదవండి : HMDA Chief Engineer | హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ నివాసాల్లో ఏసీబీ సోదాలు