Nizamabad Courts | భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు

భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Courts | భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడికి న్యాయస్థానం జీవితఖైదు (Life Imprisonment) విధించింది. ఈ మేరకు నిజామాబాద్ (Nizamabad)​ నాలుగో అదనపు జిల్లా సెషన్స్​ జడ్జి దుర్గాప్రసాద్​ తీర్పు వెలువరించారు.

Nizamabad Courts | ఆలూర్​ మండలం కల్లెడ గ్రామానికి..

వివరాల్లోకి వెళ్తే.. ఆలూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్​కు మొదట వివాహం కాగా.. మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

విడాకుల అనంతరం శంకర్​ జక్రాన్​పల్లికి చెందిన యమునను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి కూతరు జన్మించింది. అయితే యమునకు ఆలూర్​ మండలానికి చెందిన నందుతో అక్రమ సంబంధం ఏర్పడింది.

ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని యమున నిర్ణయించుకుంది. ఈ క్రమంలో మే 7, 2025 న డాబా పైన పడుకున్న సమయంలో వర్షం వస్తుండటంతో కిందికి దిగుతున్న భర్తను యమున వెనుక నుంచి తోసేసింది.

కిందపడి గాయపడిన శంకర్​ను ఇంట్లోకి తీసుకెళ్లిన యమున.. తన ప్రియుడు నందును ఇంటికెళ్లి పిలుచుకొచ్చింది. ఇద్దరు కలిసి శంకర్​ గొంతు నులిమి హత్య చేశారు.

కాగా, ఆమె ప్రవర్తనపై అనుమానంతో మొదటి భార్య కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ క్రమంలో యమునను విచారించగా తన ప్రియుడు నందుతో కలిసి శంకర్​ను హత్య చేసినట్లు ఒప్పుకొంది. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు నిందితులిద్దరికీ జీవిత ఖైదు విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది.

court

ఇది కూడా చదవండి: గురుగ్రామ్–ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌లో వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *