Nizamabad Fake Currency | నిజామాబాద్‌లో నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు నిందితుల అరెస్టు.. భారీగా నగదు స్వాధీనం

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారికి సహకరించిన మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Nizamabad Fake Currency | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ముఠాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు 2026 జులై 15న 5 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి నకిలీ కరెన్సీతో పాటు నగదు, మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Dr. Anil Menon | అంతరిక్షంలోకి మరో ఇండియన్​.. ఎవరంటే..!

Nizamabad Fake Currency | రూ. 1.65 లక్షల నగదు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 5 టౌన్ ఎస్‌హెచ్‌వో సునీల్ ఆధ్వర్యంలో నాగారం చౌరస్తా వద్ద చేపట్టిన వాహన తనిఖీల్లో మోటార్‌సైకిల్‌పై వచ్చిన షేక్ కైజర్, రమేష్ గౌడ్ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా షేక్ కైజర్ వద్ద రూ.500 నకిలీ కరెన్సీ నోట్లు, సుమారు రూ.1,65,000 విలువైన అసలు నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, రబ్బర్ బ్యాండ్లు, కవర్లు, ఒక మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రమేష్ గౌడ్ వద్ద ఖాళీ సిమ్ కార్డ్ పౌచులు, రూ.5,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Nizamabad Fake Currency | ఎనిమిది మందిపై కేసు నమోదు

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారికి సహకరించిన మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం ప్రధాన నిందితులైన షేక్ కైజర్, రమేష్ గౌడ్‌లను బుధవారం చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసుకు సంబంధించిన ఇతర నిందితుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని, నకిలీ కరెన్సీ చలామణి వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను వెలికితీసేందుకు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *