అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Jail Warder | నిజామాబాద్(Nizamabad) జిల్లా సెంట్రల్ జైలులో వార్డర్ అడ్డదారి తొక్కాడు. చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తితో చేతులు కలిపి అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన నిజామాబాద్ సెంట్రల్ జైలులో (Central Jail) చోటుచేసుకోగా.. ప్రస్తుతం జిల్లాలో ఈ ఘటన చర్చనీయాంశమైంది.
Nizamabad Jail Warder | చోరీల్లో ఆరితేరిన దొంగతో..
వివరాల్లోకి వెళ్తే.. బాన్సువాడలో ఓ చోరీ కేసులో పట్టుబడ్డ సిద్దిపేట (Siddipet Police) జిల్లా తొగుట మండలం లింగంపేట గ్రామానికి చెందిన భిక్షపతిని పోలీసులు నిజామాబాద్ సెంట్రల్ జైలుకు (Police Investigation) తరలించారు. అతడు ఎనిమిది నెలలుగా కేంద్ర కారాగారంలోనే ఉన్నాడు. అయితే చోరీల్లో సిద్ధహస్తుడైన భిక్షపతితో జైలు వార్డర్ గోపాల్ కుమ్మక్కయ్యాడు. తాను బెయిల్ ఇప్పిస్తానని బయటకు వెళ్లాక చోరీ సొత్తులో వాటా ఇవ్వాలని డీల్ కుదుర్చుకున్నాడు. దీనికి భిక్షపతి అంగీకరించడంతో రూ.50వేలు తీసుకుని బెయిల్ ఇప్పించాడు. ఈ సందర్భంగా బయటకు వెళ్లిన భిక్షపతి మళ్లీ చోరీలకు పాల్పడడం షురూ చేశాడు. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో చోరీ చేయగా ప్రత్యేక పోలీసు బృందాలు మూడు రోజుల కిందట అతనిని అరెస్టు చేశాయి. ఈ సందర్భంగా అతడిని తమదైన శైలిలో విచారించగా నిజామాబాద్ సెంట్రల్ జైల్ వార్డర్ గుట్టు రట్టయ్యింది.
Nizamabad Jail Warder | నివ్వెరపోయే విషయాలు వెలుగులోకి..
ఈ సందర్భంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్లో (Siddipet Police Commissionerate) సీపీ రష్మీ, అదనపు డీసీపీ కుశాల్కర్ బుధవారం వివరాలు వెల్లడించారు. నిజామాబాద్ జైలు వార్డర్ గోపాల్.. భిక్షపతికి బెయిల్ ఇప్పించడంతో బయటపడ్డ భిక్షపతి ఆయా జిల్లాల్లో సుమారు 64 చోరీలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఈ సందర్భంగా దుబ్బాకలో జరిగిన చోరీ ఘటనలో రూ.కిలోల కొద్దీ బంగారు, 8 కిలోల వెండి ఆభరణాలు, రూ.8 లక్షల నగదు పోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు. అయితే బెయిల్ ఇప్పించి అక్రమాలకు పాల్పడిన వార్డర్ గోపాల్ను ఈ కేసులో పోలీసులు ఏ–2గా చేర్చారు. అయితే ప్రస్తుతం గోపాల్ సెలవులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి: July 16 Gold Prices | బంగారం ధరల్లో మళ్లీ పెరుగుదల.. 24 క్యారెట్ల గ్రాము గోల్డ్ ఎంతంటే!