Illegal Clinics Nizamabad | అనుమతి లేని క్లినిక్​లపై వైద్యశాఖ దాడులు.. నాలుగు దవాఖానాలు సీజ్

అనుమతిలేని క్లినిక్​లపై జిల్లా వైద్యశాఖ కొరడా ఝులిపించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Illegal Clinics Nizamabad | అనుమతిలేని క్లినిక్​లపై జిల్లా వైద్యశాఖ(Health Department) కొరడా ఝులిపించింది. జిల్లా కేంద్రంలో(Nizamabad) అనుమతి లేకుండా నలుగురు పీఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్​లను సీజ్​ చేసింది.

Illegal Clinics Nizamabad | నాల్గో టౌన్​ పరిధిలోని..

నగరంలోని నాలుగో టౌన్ పరిధిలో డీఎంహెచ్​వో రాజశ్రీ ఆదేశానుసారం వైద్యురాలు సుప్రియ ఆధ్వర్యంలో వైద్యశాఖాధికారులు పలు క్లినిక్​లపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ స్టేట్ మెడికల్ కౌన్సిల్(State Medical Council) ఆధ్వర్యంలో గతంలో జిల్లాలో పీఎంపీ,ఆర్​ఎంపీలు నిర్వహిస్తున్న క్లినిక్​లను తనిఖీ చేశారన్నారు. అర్హతకు మించి వైద్యం చేయడం.. యాంటీబయాటిక్స్ ఇష్టానుసారంగా ఇవ్వడాన్ని పరిశీలించిన కౌన్సిల్ సభ్యులు సంబంధిత క్లినిక్​లు నిర్వహిస్తున్న వారికి నోటీసులు సైతం ఇచ్చారు.

అనంతరం వారిపై ఎఫ్​ఐఆర్​లు కూడా నమోదయ్యాయి. ఈ సందర్భంగా మెడికల్ కౌన్సిల్ నుంచి జిల్లా వైద్య శాఖకు వచ్చిన ఆదేశానుసారం గురువారం 4 క్లినిక్​లను అధికారులు సీజ్ చేశారు. నాలుగో టౌన్ ఎస్ఐ కరీం ఆధ్వర్యంలో సిబ్బంది ఆయా క్లినిక్​లకు చేరుకొని సీజ్ చేస్తున్నట్లుగా నోటీసులు అంటించారు, ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారులు, రామకృష్ణ, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

678 1288

ఇది కూడా చదవండి: భక్తుల జయజయ ధ్వానాల మధ్య కొనసాగుతున్న పూరీ జగన్నాథ రథయాత్ర 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *