అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Fake Documents | నిజామాబాద్ నగరంలో అక్రమార్కులకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. తాజాగా కొందరు వ్యక్తులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఓ స్థలాన్ని కాజేసేందుకు యత్నించి దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. నగరంలోని త్రి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ మహిళ భర్త గతంలో మరణించాడు. అయితే అతని పేరిట చంద్రశేఖర్ కాలనీ సమీపంలో 50 గజాల స్థలం ఉంది. ఇది ఆమె భర్త పేరిట ఉంది. స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు కేటుగాళ్లు కన్నేశారు. దానిని కొట్టేసేందుకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు.
Fake Documents | ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి..
ఖాళీ స్థలంపై కన్నేసిన ఇర్ఫాన్, సలీం, శివ అనే వ్యక్తులు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. డాక్యుమెంట్ రైటర్ శ్రీనివాస్ అనే వ్యక్తితో మహిళ భర్త పేరిట ఉన్న స్థలంపై ఇతరుల పేరిట నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించారు. అనంతరం దానిని ఇతరుల పేరిట మార్చారు. అయితే విషయం తెలుసుకున్న బాధితురాలు మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీపీ ఆదేశాల మేరకు, ఏసీపీ చొరవతో టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, మూడో టౌన్ ఎస్సై హరిబాబు విచారణ చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పోలీసులు మరింత లోతైన విచారణ చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి..: Tahsildar Suspension | అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్.. తహశీల్దార్‌పై వేటు