Kamareddy Police Sports | రాష్ట్ర పోలీస్ క్రీడల్లో కామారెడ్డి పోలీసుల అద్భుత ప్రతిభ

రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police Sports | రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు అద్భుత ప్రతిభ చూపారు. హైదరాబాద్​లోని మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో ఈనెల 7 నుంచి 9 వరకు ఈ క్రీడాపోటీలు జరిగాయి.

Kamareddy Police Sports | ప్రతిభ చూపి.. ఆరు పతకాలు సాధించి..

కామారెడ్డి జిల్లా (Kamareddy District) తరపున బరిలో నిలిచిన ఐదుగురు సిబ్బంది ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం 6 పతకాలు సాధించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పతక విజేతలను ఎస్పీ రాజేష్ చంద్ర సన్మానించి అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు విధుల్లో సమర్థతతో పాటు క్రీడల్లోనూ రాణించడం ప్రతి సిబ్బందికి ఆదర్శమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంచుతాయని, ఇవే లక్షణాలు విధి నిర్వహణలో మరింత ఉపయోగపడతాయని తెలిపారు.

Kamareddy Police Sports | క్రీడలకు అత్యంత ప్రాధాన్యం..

Kamareddy Police Sports

జిల్లాలో క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, సిబ్బంది విధులతో పాటు క్రీడల్లోనూ రాణించి జిల్లా, రాష్ట్రానికి పేరు తేవాలని ఎస్పీ సూచించారు. రాష్ట్ర స్థాయిలో విజయం సాధించిన వారు ఇదే స్ఫూర్తితో జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించి తెలంగాణ పోలీసు శాఖకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏఆర్ డీఎస్పీ ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లా నుంచి పలు క్రీడల్లో పోటీపడ్డారు. వుషూ 80 కేజీల విభాగంలో కామారెడ్డి పీఎస్​కు చెందిన ఎన్. ఉత్తేజ్ స్వర్ణం, అదే విభాగం బాక్సింగ్‌లో రజతం సాధించారు. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్​కు చెందిన బాలరాజు రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 97 కేజీల్లో రజతం, డీఏఆర్ కామారెడ్డికి చెందిన జె.అంకోష్ రెజ్లింగ్ గ్రెకో రోమన్ 87 కేజీల్లో, ఎన్. ప్రభు గ్రెకో రోమన్ 97 కేజీల్లో కాంస్యం గెలుచుకున్నారు. సదాశివనగర్ పోలీస్ స్టేషన్​కు చెందిన వినయ్ రెడ్డి కరాటే 60 కేజీల్లో కాంస్య పతకం అందుకున్నారు. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Anganwadi Safety Issues | యూరియా బస్తాల మధ్య చిన్నారుల చదువులు.. అధ్వానంగా అంగన్​వాడీల నిర్వహణ..

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *