Drunk Driving Cases | మూడు వారాలు.. 559 కేసులు.. కొనసాగుతున్న డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు..

డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడితే భారీగా జరిమానాలు, జైలుశిక్షలు వేస్తున్నప్పటికీ మందు బాబుల్లో మార్పు రావట్లేదు. నిత్యం తనిఖీలు చేపడుతున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Driving Cases | డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో పట్టుబడితే భారీగా జరిమానాలు, జైలుశిక్షలు వేస్తున్నప్పటికీ మందు బాబుల్లో మార్పు రావట్లేదు. మద్యం తాగి దర్జాగా రోడ్లపై వాహనాలతో తిరుగుతున్నారు. పోలీసులు సైతం ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేస్తూ జరిమానాలు విధిస్తున్నారు.

Drunk Driving Cases | మూడు వారాల్లో 559 కేసులు..

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన 3 వారాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ 559 కేసులు నమోదు చేసినట్లు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. రూ. 52,80,000 జరిమానాల రూపంలో వసూలు చేశామని, 31 మందికి న్యాయస్థానాలు వారం రోజులు జైలు శిక్షలు విధించాయని కమిషనర్​ తెలిపారు. నిజామాబాద్, బోధన్, అర్మూర్ ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో మూడు వారాల పాటు డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మద్యం సేవించి రోడ్లపైకి వస్తే మొదటిసారిగా జరిమానా విధిస్తారని.. మరోసారి సైతం పోలీసులకు పట్టుబడితే తప్పనిసరిగా జైలుశిక్ష విధించబడుతుందని సీపీ వివరించారు. కాబట్టి ప్రజలు మద్యం సేవించి రోడ్లపైకి రావొద్దని.. తద్వారా ప్రమాదాలకు కారణం కావొద్దని ఆయన హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Irrigation Issues | 18 ఏళ్లుగా ఇందూరును కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎడారిగా మర్చాయి..: దినేష్​ కులాచారి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *