Cordon Search | ఎల్లారెడ్డిలో కార్డన్ సెర్చ్..135 వాహనాలు సీజ్

ఎల్లారెడ్డి మండల కేంద్రంలో తెల్లవారుజామున పోలీసులు కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు.

shashi kiran Mottala

అక్షరటుడే,ఎల్లారెడ్డి: Cordon Search | ఎల్లారెడ్డి (Yellareddy) మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఉదయాన్నే ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

Cordon Search | ఎర్రమనుకుచ్చ, బీసీ కాలనీల్లో..

ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎర్రమనుకుచ్చ, బీసీ కాలనీల్లో డీఎస్పీ శ్రీనివాసరావు  (Yellareddy Police) ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు తనిఖీలు నిర్వహించాయి. తెల్లవారుజామున 5 గంటల నుండి పోలీసులు హడావిడి చేయడంతో ఏం జరిగిందోనని ప్రజలు అయోమయానికి గురయ్యారు. పోలీసులు తనిఖీల్లో భాగంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని సుమారు 135 బైక్​లు, 8 ఆటోలు, కార్లు ఇతర వాహనాలను స్వాధీనం (Vehicle Seizure) చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సరైన పత్రాలు తీసుకొచ్చి వాహనాలను తీసుకెళ్లాలని డీఎస్పీ సూచించారు. చోరీ చేసిన వాహనాలతో కొందరు వ్యక్తులు చట్టవ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి, ఎస్‌ఎస్ నగర్ సీఐ, సబ్ డివిజన్ ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

bikes

ఇది కూడా చదవండి: జమ్మూ కాశ్మీర్: భారీ వర్షాల నేపథ్యంలో రాజౌరీ పట్టణాన్ని ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వందల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *