అక్షరటుడే, వెబ్డెస్క్: Unemployment Safety Net | కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట కవిత మరోసారి విమర్శలు గుప్పించారు. ఉద్యోగం కోల్పోయిన కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించే విషయంలో భారత్ ఇంకా వెనుకబడి ఉందని, అభివృద్ధి చెందిన దేశాల తరహాలో జాతీయ స్థాయి నిరుద్యోగ భద్రతా వ్యవస్థను వెంటనే ఏర్పాటు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Kalvakuntla Kavitha | ఎల్నినో వచ్చిన ప్రభుత్వానికి సోయి లేదు : కవిత
Unemployment Safety Net | ఆ దేశాల్లో నిరుద్యోగ భృతి..
డెన్మార్క్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, బెల్జియం, జర్మనీ, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉద్యోగం కోల్పోయిన వారికి వారి ఆదాయంలో గణనీయమైన శాతాన్ని నిరుద్యోగ భృతిగా అందిస్తున్నారని కవిత పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగం కోల్పోయిన వారి ఆదాయంలో సుమారు 60 నుంచి 80 శాతం వరకు భర్తీ చేసే విధానాలు అమలులో ఉన్నాయని ఆమె తెలిపారు.
Unemployment Safety Net | సెవరెన్స్ ప్యాకేజీలపై పన్నులా..?
భారత్లో మాత్రం సమగ్ర నిరుద్యోగ భద్రతా వ్యవస్థ లేకపోవడమే కాకుండా, ఉద్యోగ విరమణ సమయంలో లభించే సెవరెన్స్ ప్యాకేజీలపై కూడా పన్నులు విధిస్తున్నారని కవిత విమర్శించారు. కార్మికుల ఆర్థిక గౌరవాన్ని కాపాడాలంటే ఉద్యోగం కోల్పోయిన సమయంలో వారికి కనీస భద్రత కల్పించే విధానాలు అత్యవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
Unemployment Safety Net | నిరుద్యోగ భద్రతా వలయం ఏర్పాటుకు డిమాండ్
దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కార్మికుల సంక్షేమమే పునాది అని పేర్కొన్న కవిత.. ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి నిరుద్యోగ భద్రతా వలయం (National Unemployment Safety Net)ను ఏర్పాటు చేయాలని కోరారు.
ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ అంశాలను ఇకపై నిర్లక్ష్యం చేయకుండా కేంద్ర ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు. దేశ కార్మిక వర్గానికి భరోసా కల్పించే విధానాలే నిజమైన ఆర్థిక గౌరవానికి నిదర్శనమని కవిత తన పోస్టులో పేర్కొన్నారు.