తెలంగాణTelangana Heatwave | రానున్న మూడు రోజులు మండనున్న ఎండలు

Telangana Heatwave | రానున్న మూడు రోజులు మండనున్న ఎండలు

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heatwave | రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడింది. ఆకాశం మేఘావృతం అయి ఉంటుంది. అయితే వేడి మాత్రం అధికంగా ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏసీలు, కూలర్ల వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఎండలు మండుతాయని అధికారులు తెలిపారు.

Telangana Heatwave | ఆ జిల్లాలకు అలెర్ట్

ఉత్తర తెలంగాణ (Telangana)లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్​, నిర్మల్​, మంచిర్యాల, నిజామాబాద్​ జిల్లా (Nizamabad District)ల్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్​ నగరంలో 43 డిగ్రీలకు చేరుకునే ఛాన్స్​ ఉంది.

Telangana Heatwave | 28 నుంచి వర్షాలు

హీట్​వేవ్ అనంతరం ఈ నెల 28, 29 తేదీల నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు పడుతాయని అధికారులు తెలిపారు. మే మొదటి వారం వరకు అకాల వర్షాలు కురుస్తాయి. ఆసిఫాబాద్ నుంచి సూర్యాపేట వరకు తూర్పు తెలంగాణ ప్రాంతం, అలాగే శ్రీకాకుళం నుంచి గుంటూరు బెల్టు వరకు ఉన్న ఉత్తర, మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు భారీ వర్షాలు పడనున్నాయి.

ఇది కూడా చదవండి..: Kavitha Party Controversy | కవిత పార్టీపై బీఆర్​ఎస్​ సెటైర్లు

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....