Rakesh Reddy | రాకేష్​ రెడ్డి ఇంటి ముట్టడికి యత్నం.. పలువురు కాంగ్రెస్​ నాయకుల అరెస్ట్​

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్​ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్​ కార్యకర్తలు యత్నించగా.. అంకాపూర్​లో పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్​: Rakesh Reddy | ఆర్మూర్​ నియోజకవర్గంలోని అంకాపూర్​లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. పోలీసులు అంకాపూర్​లోకి వచ్చే మార్గాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Rakesh Reddy | పోలీసులను తప్పించుకొని..

Rakesh Reddy

ఈ క్రమంలో సోమవారం ఉదయం పలువురు కాంగ్రెస్​ కార్యకర్తలు ఆర్మూర్​ (Armoor) ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసుల కళ్లు గప్పి వారు ఎమ్మెల్యే ఇంటివైపు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్​ నాయకులు రాకేష్​రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేర్చాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తోపులాట జరగగా.. కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారికి అదుపులోకి తీసుకుని జీప్​లలో ఎక్కించారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Rakesh Reddy | పటిష్టమైన భద్రత..

Rakesh Reddy

కాంగ్రెస్​, బీజేపీ సవాళ్లు.. ప్రతిసవాళ్ల నేపథ్యంలో అంకాపూర్​లో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆర్మూర్​ పీఎస్​, నందిపేట్​, మోర్తాడ్​, మాక్లూర్​, ఆలూర్​ మండలాల పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్​, ఆర్మూర్​ వైపుల నుంచి అంకాపూర్​లోకి వచ్చీవెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

33

ఇది కూడా చదవండి..: Armoor Political Tension | ఆర్మూర్​లో హైటెన్షన్.. వినయ్​ రెడ్డి హౌస్​ అరెస్ట్

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *