అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Footpath Encroachments | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు కోసం జీహెచ్ఎంసీ అధికారులు (GHMC Officers) ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. ప్రతి శనివారం ఆక్రమణలను తొలగిస్తున్నారు.
నగరంలో చాలా ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు ఆక్రమణలకు గురైన విషయం తెలిసిందే. వాటిపై పలువురు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దుకాణదారులు, షాపింగ్ మళ్ల నిర్వాహకులు సైతం ఫుట్‌పాత్‌లను ఆక్రమించారు. దీంతో ప్రజలు రోడ్లపై నడుస్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్‌తో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.. రోడ్లపై పాదచారులు నడవడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో అధికారులు ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన షెడ్లు, ఇతర నిర్మాణాలను తొలగిస్తున్నారు.
Footpath Encroachments | ఎస్ఆర్ నగర్లో..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు తాజాగా ఎస్ఆర్ నగర్లో ఆక్రమణల తొలగింపు డ్రైవ్‌ను నిర్వహించారు. పాదచారుల రాకపోకలను మెరుగుపరచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ఫుట్‌పాత్‌లను క్లియర్ చేయడంపై ఈ ఆపరేషన్ దృష్టి సారించింది. పోలీసుల సహకారంతో అధికారులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇలాంటి చర్యలు ఇతర ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Gachibowli Stadium | రూపురేఖలు మారనున్న గచ్చిబౌలి స్టేడియం.. PPP విధానంలో అభివృద్ధికి నిర్ణయం!