అక్షరటుడే, ఇందూరు: Low Level Bridge | ప్రజలకు సౌకర్యంగా ఉండేలా నూతన వంతెన నిర్మాణానికి అవసరమైన అంచనాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (Mla Dhanpal Suryanarayana Gupta) సూచించారు. నగరంలోని (Nizamabad) వినాయక నగర్ నుంచి ఎల్లమ్మ గుట్టకు వెళ్లే దారిలో బాల హనుమాన్ ఆలయం పక్కన గల లో లెవెల్ వంతెనని (Low Level Bridge) మంగళవారం పరిశీలించారు.
Low Level Bridge | వర్షాకాలంలో వంతెన వద్ద ఇబ్బందులు
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం వంతెన వద్ద నీరు చేరి వాహన రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని తన దృష్టికి వచ్చిందన్నారు. అలాగే బ్రిడ్జి ఇరువైపులా రోడ్డు దెబ్బ తినడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, తక్షణమే చదును చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన వంతెన నిర్మాణానికి అంచనాలను సిద్ధం చేసి ప్రపోజల్ పెట్టాలని సూచించారు. వీలైనంత తొందరగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట స్థానిక కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, ఏబీవీపీ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : ఢిల్లీలో నిన్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జీకి నిరసనగా ప్రధాని నివాసం బయట ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరసన