Telangana Power Generation | గ‌రిష్ట స్థాయిలో విద్యుత్​ ఉత్ప‌త్తి సాధించాలి : డిప్యూటీ సీఎం

రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్​ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Power Generation | రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్​ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని థర్మల్ పవర్ స్టేషన్లకు తగినంత, నిరంతరాయమైన నాణ్యమైన బొగ్గును సరఫరా చేయాలన్నారు. ఈ మేరకు సింగ‌రేణి గ‌నుల్లో తాను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని ప్రకటించారు.

ఎల్​నినో (El Nino) ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడటం లేదు. దీంతో జులై ముగింపునకు వచ్చిన జలాశయాల్లోకి ఇన్​ఫ్లో రావడం లేదు. ఫలితంగా జల విద్యత్​ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. సాధారణంగా జులైలో ప్రాజెక్ట్​లోకి వరద వస్తుంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి చేసి దిగువకు నీటిని వదులుతారు. మరోవైపు వర్షాలు లేకపోవడంతో రైతులు వ్యవసాయ బోర్లను నిరంతరం నడిపిస్తున్నారు. దీంతో విద్యుత్​ డిమాండ్​ పెరిగింది. ఈ క్రమంలో థర్మల్ కేంద్రాల్లో గరిష్ట స్థాయిలో విద్యుత్​ ఉత్పత్తి చేపట్టాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం సమీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర విద్యుత్ అవ‌స‌రాలు తీర్చేందుకు, ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారులకు సూచించారు.

Telangana Power Generation | పెరిగిన సామర్థ్యం

ప్ర‌జాప్ర‌భుత్వం తీసుకున్నచ‌ర్య‌ల మూలంగా 2026–27 నాటికి జెన్ కో మొత్తం థర్మల్ విద్యుత్ (Thermal electricity) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగి 7,180 మెగావాట్లకు చేరిందని డిప్యూటీ సీఎం తెలిపారు. బొగ్గు సరఫరాలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, జెన్ కో థర్మల్ విద్యుత్ కేంద్రాలు 2025-26లో విజయవంతంగా 27,908 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశాయన్నారు. రాష్ట్ర‌ మొత్తం విద్యుత్ డిమాండ్‌లో 31 శాతం అవసరాలను జెన్ కో తీర్చింద‌న్నారు. బొగ్గు స‌ర‌ఫ‌రాను మెరుగుప‌రిచి.. రాష్ట్ర విద్యుత్ అవ‌స‌రాల్లో 40 శాతం మేర జెన్​ కో తీర్చ‌గ‌లిగేస్థాయికి చేరుస్తామ‌నే పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Rahul Gandhi Detention | రాహుల్ గాంధీ ధర్నా భగ్నం.. అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *