అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే సమాచారంతో టీజీ రెడ్కో (TGREDCO) డీఈ ముత్యం వెంకటరమణ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏక కాలంలో 15 చోట్ల 8 బృందాలతో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున నుంచే ఈ తనిఖీలు చేపట్టారు.
ముత్యం వెంకటరమణ టీజీ రెడ్కోలో డిప్యూటీ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. ఆయన భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. ఏసీబీ డీఎస్పీ (ACB DSP) మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. మాదాపూర్ (Madhapur)లోని ఆయన నివాసంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.
ACB Raids | కీలక పత్రాలు స్వాధీనం
సోదాల్లో కీలక ఆస్తి పత్రాలు, డబ్బు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. డీఈ వెంకటరమణ విధి నిర్వహణలో అక్రమాలకు పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దాడులు ముగిశాక ఏసీబీ అధికారులు వివరాలు వెల్లడించనున్నారు. అయితే వెంకటరమణ 2019లో ఎస్పీడీసీఎల్ (SPDCL) డీఈగా ఉన్న సమయంలో లంచం తీసుకుంటూ దొరికాడు. అప్పుడు కూడా ఆయన ఇంట్లో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. అవినీతి చేస్తూ దొరికిన అధికారిపై చర్యలు తీసుకోకపోవడంతో మళ్లీ పోస్టింగ్ భారీగా లంచాలు తీసుకున్నట్లు సమాచారం.
@TelanganaACB raids #TGREDCO official over alleged #DisproportionateAssets
The #Telangana Anti-Corruption Bureau (#ACB ) is conducting simultaneous #raids at the residence of TGREDCO Deputy Engineer (DE) Muthyam Venkataramana and more than 10 other locations.
The searches are… pic.twitter.com/cMCZipIKbF
— NewsMeter (@NewsMeter_In) July 22, 2026
దీనిని కూడా చదవండి : California Road Accident | అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురి మృతి