NEET Protest Telangana | ‘నీట్’​ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలు..: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి

‘నీట్’ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ​ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: ‘నీట్’(NEET)​ విషయంలో కేంద్ర ప్రభుత్వానివి తప్పుడు విధానాలని ప్రభుత్వ సలహాదారు, బోధన్ ​(bodhan) ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి (Mla Sudarshan Reddy) దుయ్యబట్టారు. ఈ మేరకు నగరంలో మీడియాతో మాట్లాడారు.

NEET Protest Telangana | న్యాయం చేయమని అడిగితే లాఠీఛార్జీలా..?

నెలరోజులుగా నీట్​ పరీక్ష విషయంలో న్యాయం చేయాలని విద్యార్థులు అడిగితే వారిపై లాఠీఛార్జీ చేయడం కేంద్ర ప్రభుత్వ అరాచక చర్య అని సుదర్శన్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామాపై మాట్లాడకుండా విద్యార్థుల ఉద్యమాన్ని అణగదొక్కేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై అమానుషమైన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్​ అయిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలన్నారు.

NEET Protest Telangana | విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ..

విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం ముమ్మరం చేస్తామని ప్రభుత్వ సలహాదారు తెలిపారు. ఉద్యమాలను అణిచివేయడంలో బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్​ వాళ్లను సైతం మించిపోయారని విమర్శించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడడం మానుకోవాలి ఈ దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల న్యాయమైన కోరికను వెంటనే తీర్చాలని డిమాండ్​ చేశారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్​ బిన్ హందాన్​, కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పారిపెల్లి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: “నిద్రపోయే వాళ్లను లేపొచ్చు.. కానీ వీళ్లది నిద్ర నటించే ప్రభుత్వం.” – వైసీపీ అధినేత జగన్​ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *