అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nasha Mukt Bharat | మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం సూచించారు. సీబీసీ నిజామాబాద్ (CBC Nizamabad) ఆధ్వర్యంలో గిర్రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో(Girraj Government Degree College) నషా ముక్త్ భారత్ అభియాన్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Nasha Mukt Bharat | విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టాలి..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఈగల్ ఫోర్స్ నిజామాబాద్ డీఎస్పీ సోమనాథం మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మంచి స్నేహాలను ఎంచుకుని విద్య, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ (Drug Free Telangana) లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు, కఠిన చర్యలను సమర్థవంతంగా కొనసాగిస్తోందని తెలిపారు. సరదాగా మాదకద్రవ్యాలను ఒకసారి వినియోగించినా అది వ్యసనానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Nasha Mukt Bharat | జీవితాలను దెబ్బతీస్తాయి..
మాదకద్రవ్యాల వ్యసనం ఆరోగ్యం, విద్య, ఉపాధి, కుటుంబ జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని సోమనాథం పేర్కొన్నారు. గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాం మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమానికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. తోటి వారి ఒత్తిడికి లొంగకుండా కుటుంబ సభ్యులు, సమాజంలో అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రతిఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని సూచించారు. డ్రగ్-ఫ్రీ తెలంగాణ సాధనలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని కోరారు. సీబీసీ నిజామాబాద్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటివల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై యువతలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈగల్ ఫోర్స్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సమకూరే నిధులు నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని తెలిపారు. డ్రగ్ మాఫియా ప్రధానంగా యువతనే లక్ష్యంగా చేసుకుంటుందని, అందువల్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కళాశాల అధ్యాపకురాలు నహీదా బేగం, ఆకాశవాణి ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ మోహన్ దాస్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: 24న విద్యాసంస్థల బంద్కు పిలుపు