Gadwal Vijayalaxmi Women Commission | తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి బాధ్యతల స్వీకరణ

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gadwal Vijayalaxmi Women Commission | రాష్ట్ర మహిళా కమిషన్ నూతన ఛైర్‌పర్సన్‌గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Gadwal Vijayalaxmi Women Commission | ఐదేళ్ల పాటు

రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం… జీఓ నెం. 637 ద్వారా విజయలక్ష్మిని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఈ పదవిలో ఆమె ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.

గతంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌గా సేవలందించిన విస్తృత అనుభవం ఉన్న గద్వాల విజయలక్ష్మి నేతృత్వంలో రాష్ట్రంలో మహిళల భద్రత, అతివల హక్కుల పరిరక్షణ, సంక్షేమ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు కాగలవని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆమెకు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

11,000-Carat Rare Ruby Discovered in Mogok | “రక్తపు వెలుగులీనిన వెదజల్లిన రత్నాల గడ్డ” – మోగక్‌లో 11,000 క్యారెట్ల అరుదైన మహా కెంపు వెలుగు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *