అక్షరటుడే, వెబ్‌డెస్క్ : REDCO DE Assets | హైదరాబాద్ (Hyderabad)లోని ఖైరతాబాద్ రెడ్కో (పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ) డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ (DE Venkata Ramana)పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. ఈ మేరకు ఏసీబీ (ACB) అధికారులు బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో సోదాలు చేశారు.
ముత్యం వెంకట రమణ తన సర్వీసు కాలంలో అవినీతి పద్ధతులు, అనుమానాస్పద మార్గాల ద్వారా ఆస్తులు సంపాదించారు. దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. బుధవారం అతని ఇల్లు, కార్యాలయం, బంధువులు, సహచరులు, బినామీదార్లకు చెందిన మరో 7 ప్రదేశాలలో సోదాలు చేశారు. ఈ సమయంలో అనేక ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
REDCO DE Assets | ఆస్తుల వివరాలు..
శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి (Kukatpalli)లో ఉన్న నాలుగు నివాస ఫ్లాట్లు, కూకట్‌పల్లిలోని ఆంజనేయ నగర్‌లో G+3 వాణిజ్య భవనం, గుట్టల బేగంపేట్ గ్రామంలో G+5 వాణిజ్య భవనం డీఈ అక్రమంగా సంపాదించినట్లు గుర్తించారు. డీఈ వెంకటరమణ తన భార్య పేరు మీద నమోదైన నాలుగు నిర్మాణ సంస్థల ద్వారా నిర్మాణ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మూసాపేట్, ఆంజనేయ నగర్‌లో సుమారు రూ. 20 కోట్ల పెట్టుబడితో 10 నివాస అపార్ట్‌మెంట్లను నిర్మించారు. ఈ ఆస్తుల మార్కెట్ విలువ రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
REDCO DE Assets | రెండు కిలోల బంగారం
డీఈ బ్యాంకు ఖాతాల్లో రూ. 52,02,585 నగదు ఉంది. ఆయన ఇంట్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, రూ. 45 లక్షల విలువైన కియా, మహీంద్రా, బాలెనో వాహనాలు గుర్తించారు. రూ. 2.5 లక్షల విలువైన 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 19 విదేశీ మద్యం బాటిళ్లు ఉండటం గమనార్హం.
దీనిని కూడా చదవండి : Land Registrations | తహశీల్దార్‌పై వేటు సరే.. ఆ ఆపరేటర్‌పై చర్యలేవి..!