నిజామాబాద్Registration Department | రిజిస్ట్రేషన్ల శాఖలో సిబ్బంది తప్పిదం.. గందరగోళంగా మ్యుటేషన్లు

Registration Department | రిజిస్ట్రేషన్ల శాఖలో సిబ్బంది తప్పిదం.. గందరగోళంగా మ్యుటేషన్లు

నిజామాబాద్​ రిజిస్ట్రేషన్ల శాఖ పాలన పూర్తిగా గాడితప్పింది. ఇన్​ఛార్జి అధికారులు ఉండడం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమాలకు తోడు తప్పిదాలు పరిపాటిగా మారింది.

అక్షరటుడే, నిజామాబాద్​: Registration Department | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని రిజిస్ట్రేషన్ల కార్యాలయాలపై పర్యవేక్షణ కొరవడింది. డీఐజీ, డీఆర్​ ఇన్​ఛార్జీలే ఉండడంతో పూర్తిగా పాలన గాడి తప్పింది. దీంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దొడ్డిదారిలో రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.

ఇటీవల నిజామాబాద్​ అర్బన్​ కార్యాలయం (Registration Department) పరిధిలో జరిగిన ఓ అక్రమ రిజిస్ట్రేషన్​ వ్యవహారంపై ఏకంగా క్రిమినల్​ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ ఇంటి యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు తప్పుడు ధృవపత్రాలు సృష్టించి మరొకరి పేరిట బదిలీ చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఒకటో టౌన్​ పోలీసులు పలువురిని అరెస్ట్​ చేసి రిమాండ్​కు తరలించారు. కాగా.. ఇందులో డాక్యుమెంట్​ రైటర్​ పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు తప్పుడు ప్రతాలు అని తెలిసినా అప్పటి సబ్​ రిజిస్ట్రార్​ రిజిస్ట్రేషన్​కు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

Registration Department | అడగోలుగా మ్యుటేషన్లు

నిజామాబాద్​ అర్బన్​ సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయం పరిధిలో వారం కిందట మరో తప్పిదం జరిగిన విషయం తాజాగా బయటపడింది. ఈ నెల 17, 18 తేదీల్లో సుమారు 70 వరకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. కాగా.. వీటికి సంబంధించిన మ్యుటేషన్​ ప్రక్రియలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇది కాస్తా.. దరఖాస్తుదారుల పాలిట శాపంగా మారింది.

వాస్తవానికి రిజిస్ట్రేషన్​ ప్రక్రియ సమయంలోనే మ్యుటేషన్​కు సంబంధించిన రుసుము రూ. 3వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తదనంతరం అమ్మిన వారి నుంచి కొన్న వారి పేరిట ఆస్తి తాలుకా మ్యుటేషన్​ ప్రక్రియను అంతా ఆన్​లైన్​లో పూర్తి చేసి సంబంధిత మున్సిపల్​ లాగిన్​ రిఫర్​ చేస్తారు. తదుపరిగా అక్కడి అధికారులు పున:పరిశీలన చేసి ఒకటిరెండు రోజుల్లో మ్యుటేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారు. కానీ 17, 18 తేదీల్లో జరిగిన పలు డాక్యుమెంట్లు మ్యూటేషన్​ ప్రక్రియలో పెద్ద గందరగోళం జరిగినట్లు సమాచారం. రెసిడెన్షియల్​ జోన్​కు బదులుగా కమర్షియల్​ జోన్​లో ఉన్నట్లు ఐచ్చికం ఇవ్వడంతో దాదాపు 70 వరకు దస్తావేజుల మ్యుటేషన్​ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో బాధితులు తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Registration Department | ప్రత్యేక దృష్టి సారించాలి

రిజిస్ట్రేషన్లు అంటే రూ. కోట్ల ఆస్తుల తాలుకాతో కూడుకున్నది. అధికారులు, సిబ్బంది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అధికారులు, సిబ్బంది ఎవరికి నచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ఎడిట్​ ఇండెక్స్​ ఆప్షన్​ ఉన్నప్పటికీ ఇది డీఆర్​ పరిధిలోని అంశం కావడంతో సదరు అధికారి సైతం ఇన్​ఛార్జి కావడం వల్ల ఈ ప్రక్రియ కోసం బాధితులు రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఇప్పటికైనా రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని కోరుకుంటున్నారు.

Registration Department

ఇది కూడా చదవండి..: Kavitha New Party | ఇక పిట్టల దొరసాని క్యారెక్టర్​ను చూస్తాం.. కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్​ సెటైర్లు..

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....