Revanth Reddy Challenge | చరిత్ర తెలియదు.. బలిసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు: సీఎం రేవంత్

తెలంగాణ శాసనసభలో జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Challenge | తెలంగాణ ( Telangana )శాసనసభలో జరుగుతున్న ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన.. ఓట్ల సవరణ, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలపై ఘాటుగా స్పందించారు.

Revanth Reddy Challenge | విమర్శలపై సీఎం సవాల్..

తనకు రెండు చోట్ల ఓట్లు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. తనకు ఎక్కడైనా రెండు ఓట్లు ఉన్నట్లు నిరూపించే ధైర్యం ఉంటే ఆధారాలతో సహా ఫిర్యాదు చేయవచ్చని సవాల్ విసిరారు. నిబంధనల ప్రకారమే తాను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకున్నట్లు స్పష్ట చేశారు. చరిత్ర తెలుసుకోకుండా, బలిసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రత్యర్థులపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

Revanth Reddy Challenge |  ఓట్లను కాపాడుకోవాలి..

రాష్ట్రంలోని తండాల్లో నివసించే గిరిజన ప్రజలు జీవనోపాధి కోసం, వృత్తిరీత్యా వేర్వేరు ప్రాంతాలకు వెళుతుంటారని, కేవలం ఓటింగ్ సమయంలో మాత్రమే సొంతూళ్లకు వస్తుంటారని సీఎం తెలిపారు. అటువంటి పేద ప్రజల ఓట్లు జాబితా నుంచి గల్లంతు కాకుండా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై ఉందన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకునే టార్గెట్ చేసుకుని ఓట్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ఏ ఇంటి ఓటర్లు ఎక్కడ ఉంటున్నారనే కచ్చితమైన సమాచారం బూత్ లెవల్ ఏజెంట్లకు (BLA) మాత్రమే తెలుస్తుందని చెప్పారు.

Revanth Reddy Challenge | తొలగింపు కాదు..

ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరుతో అర్హులైన నిజమైన ఓటర్ల పేర్లను తొలగించే ప్రక్రియ జరగకూడదని, అధికారులు అసలైన ప్రక్షాళన పైనే పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే 70 శాతం సర్వే పూర్తయిందని, మిగిలిన 30 శాతం సవరణ ప్రక్రియ కూడా వేగంగా పూర్తి కావాలన్నారు. పార్టీ కార్యకర్తలు, బూత్ స్థాయి ఏజెంట్లు సమన్వయంతో పనిచేస్తేనే ఓటర్ల హక్కులను పరిరక్షించగలమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  TJA Foundation Day | జర్నలిస్టుల హక్కుల సాధన, సామాజిక సేవే లక్ష్యం: టీజేఏ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *