అక్షరటుడే,కోటగిరి : Pocharam Bhaskar Reddy | ఉమ్మడి జిల్లాల డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలను కోటగిరి (Kotagiri), పోతంగల్ (Pothangal) మండలాల్లో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు కేక్‌లు కట్‌చేసి పంచిపెట్టారు.
Pocharam Bhaskar Reddy | పటాకులు కాల్చి..
పోతంగల్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో, కోటగిరి మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో భాస్కర్‌రెడ్డి కటౌట్లను ఏర్పాటు చేశారు. కేకులు కట్ చేసి పంచిపెట్టారు. పటాకులు కాల్చారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. పోచారం శీనన్న (MLA Pocharam) తనయుడు భాస్కర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉంటూ, తండ్రి మార్గంలో నడుస్తూ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు. కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్న వ్యక్తి భాస్కర్ రెడ్డి అన్నారు. అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: దక్షిణ థాయ్‌లాండ్‌లోని చెక్‌పాయింట్‌పై దాడి.. బాంబు పేలుడులో ఐదుగురు సైనికులు మృతి..