CJP Protest | నన్ను హీరోను చేయొద్దు.. సీజేపీ అధ్యక్షుడు అభిజిత్​ దీప్కే

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేయడంతో ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CJP Protest | కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా చేయడంతో ఢిల్లీ (Delhi)లోని జంతర్​ మంతర్​ వద్ద ఆందోళనకారులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం కాక్రోచ్​ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే మాట్లాడారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన తనను హీరోని చేయొద్దని అభిజిత్​ అన్నారు. ‘‘ఆ తప్పు చేయవద్దు. ఆయన రాజీనామా కారణంగా నన్ను హీరోగా చూడకండి. ఒక వ్యక్తిని హీరోని చేయడం వల్లే దేశం నాశనమైంది” అని వ్యాఖ్యానించారు. ఇది భారత రాజ్యాంగానికి దక్కిన విజయమని ఆయన పేర్కొన్నారు. ఆయన రాజీనామా చేశారని, తమకు ఇంకా రెండు డిమాండ్లు ఉన్నాయన్నారు. కానీ ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. ఈ నెల 20న విద్యార్థులపై పెట్టిన కేసులు తొలగించాలని, లాఠీచార్జీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

CJP Protest | చర్చలకు వెళ్లిన ప్రతినిధులు

ఇది మొదటి విజయమని అభిజిత్ అన్నారు. మనం ఇక్కడితో ఆగిపోమని తెలిపారు. 36 రోజులుగా ఇక్కడ కూర్చుని ఉన్న విద్యార్థులందరికీ, స్వచ్ఛంద కార్యకర్తలందరికీ ఆయన వందనం చేశారు. అనంతరం సీజేపీ ప్రతినిధులు కేంద్రంతో మూడో విడత చర్చలకు కానిస్టిట్యుషన్​ క్లబ్​కు బయలు దేరారు. మరోవైపు కేంద్ర మంత్రులు సైతం తమ నివాసాల నుంచి బయలు దేరారు. ఈ చర్చల అనంతరం నిరసనలపై సీజేపీ నిర్ణయం తీసుకోనుంది.

దీనిని కూడా చదవండి : Dharmendra Pradhan Resignation | కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *