Kodad Bypass Accident | కోదాడ బైపాస్‌పై భయానక రోడ్డు ప్రమాదం .. ఐదుగురు సురక్షితం

సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్‌పై ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kodad Bypass Accident | సూర్యాపేట ( Suryapet )జిల్లా కోదాడ బైపాస్‌పై ఆదివారం ఉదయం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు మారుతి స్విఫ్ట్ డిజైర్ కారులో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి బయలుదేరారు. కోదాడ బైపాస్‌కు చేరుకున్న సమయంలో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు వేగంగా వెళ్లి డివైడర్‌ను బలంగా ఢీకొట్టి పల్టీలు కొట్టింది.

Kodad Bypass Accident | స్థానికుల సమయస్ఫూర్తి..

ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ఎలాంటి భయం లేకుండా వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీశారు. కారులో ఇరుక్కుపోయిన ఐదుగురిని అత్యంత చాకచక్యంగా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వారు బయటకు వచ్చిన కొద్ది క్షణాల వ్యవధిలోనే కారులో సీఎన్‌జీ గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా వ్యాపించిన మంటల కారణంగా కారు పూర్తిగా దగ్ధమైంది.

Kodad Bypass Accident | స్థానికులు చూపిన అప్రమత్తత..

ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా, స్థానికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన నలుగురు క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. స్థానికులు చూపిన అప్రమత్తత, సాహసోపేత చర్యల వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని అంతా కొనియాడుతున్నారు.

ఇది కూడా చదవండి:  Sand Transport | అధికారిక అనుమతులతోనే ఇసుక రవాణా.. స్పష్టం చేసిన​ వీడీసీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *