Jogi Ramesh Allegations | నన్ను చంపాలని చూశారు.. మాజీ మంత్రి జోగి రమేశ్ కోడలు ఆరోపణలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jogi Ramesh Allegations | ఏపీ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్​ నాయకుడు జోగి రమేశ్​పై ఆయన కోడలు సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపాడానికి జోగి రమేశ్​తో పాటు కుటుంబ సభ్యులు ప్రయత్నించారని ఆరోపించారు.

జోగి రమేశ్​కు కుమారుడు రాజీవ్ భార్య మేఘన తన మామపై సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి ప్రయత్నించారని, అదనపు కట్నం కోసం వేధించారని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వివాహం సూర్యాపేట (Suryapet)లో జరిగిందని ఆమె తెలిపారు. ఆ సమయంలో రూ.5 కోట్ల నగదుతో పాటు 1.5 కిలోల బంగారం, 10 కిలోల వెండి ఆభరణాలు ఇచ్చారని పేర్కొన్నారు. పెళ్లయిన కొన్నాళ్ల నుంచే అత్తింటి వారు అదనపు కట్నం కోసం తనను వేధించడం ప్రారంభించారని ఆమె పేర్కొన్నారు.

Jogi Ramesh Allegations | చంపేందుకు యత్నం..

పెళ్లికి ముందే భర్తకున్న శారీరక సమస్యలను దాచిపెట్టి మోసం చేశారని మేఘన పేర్కొన్నారు. ఇంటిపై నుంచి తనను తోసేయడానికి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, స్వామి యత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గోవాకు వెళ్లిన సమయంలో బోటులో నుంచి నీటిలో తోసేయడానికి యత్నించారన్నారు. నార్సింగిలోని విల్లాకు తీసుకెళ్లి దిండుతో ముఖాన్ని నొక్కి చంపాలని చూశారని ఆమె ఆరోపించారు. వాళ్లు చెప్పినట్లు వింటానని వేడుకోవడంతో తనను ఆ రోజు ప్రాణాలతో వదిలేశారని ఆమె చెప్పారు. వేధింపులు తాళలేక పోలీసులకు ఆశ్రయించినట్లు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Bonda Uma Comments | కాపులంతా ఏకం అవుతారు.. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *