Jannapalli Sarpanch Fraud | ఆర్డీవో కార్యాలయం ఎదుట యువతి ఆందోళన.. సర్పంచ్​ మోసం చేశాడని ఫిర్యాదు

సర్పంచ్​ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఆందోళనకు దిగింది.

shashi kiran Mottala

అక్షరటుడే, బోధన్ ​: Jannapalli Sarpanch Fraud | సర్పంచ్​ తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఆందోళనకు దిగింది. ఈ మేరకు బోధన్​ (Bodhan) పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగింది.

Jannapalli Sarpanch Fraud | పోతంగల్​ మండలం జల్లపల్లి ఫాం..

పోతంగల్ మండలం జల్లపల్లి ఫాం గ్రామ సర్పంచ్ దస్తగిరి తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. తనను వివాహం చేసుకుంటానని చెప్పి అన్యాయం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది . ఆరేళ్లుగా తాము ప్రేమించుకున్నామని.. రెండుసార్లు తనకు అబార్షన్​ సైతం చేయించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి చేసుకుందామని అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడని.. అతడితో తనకు పెళ్లి జరిపించాలని ఆర్డీవో కార్యాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసింది.

ఇది కూడా చదవండి..: Nizamabad Gambling Raid | పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు నిందితుల అరెస్టు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *