Indian Stock Market | ఐదు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశయ స్టాక్ మార్కెట్ ఐదు సెషన్ల తర్వాత లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 776 పాయింట్లు, నిఫ్టీ 228 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధర దిగివస్తోంది. బ్యారెల్ ధర 89 డాలర్లకు తగ్గింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పాజిటివ్‌గా మారడంతో ప్రధాన సూచీలు పరుగులు తీశాయి. అన్ని రంగాలలోనూ కొనుగోళ్ల మద్దతు కనిపించింది.

Indian Stock Market | గ్యాప్ అప్ లో ప్రారంభం..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) సోమవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 550 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 106 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి ప్రాఫిట్ బుకింగ్‌తో 198 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ 161 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మరో 36 పాయింట్లు పైకి ఎగబాకింది. అక్కడినుంచి 73 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం తర్వాత సూచీలు పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 776 పాయింట్ల లాభంతో 76,835 వద్ద, నిఫ్టీ 228 పాయింట్ల లాభంతో 23,995 వద్ద స్థిరపడ్డాయి.

Indian Stock Market | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,779 కంపెనీలు లాభపడగా 2,579 స్టాక్స్ నష్టపోయాయి. 200 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 142 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 77 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 28 స్టాక్ లాభపడగా.. 2 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. ఎటర్నల్ 5.63 శాతం, ఇండిగో 4.94 శాతం, ఇన్ఫోసిస్ 3.66 శాతం, బజాజ్ ఫైనాన్స్ 3.50 శాతం, ఆసియన్ పెయింట్ 2.87 శాతం లాభపడ్డాయి.

Losers : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 0.41 శాతం, యాక్సిస్ బ్యాంక్ 0.05 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Indian Stock Market Today | నష్టాలకు తెర.. భారీ లాభాల్లో సూచీలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *