అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RS Praveen Kumar | హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలన్న హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈ తీర్పు చెంపపెట్టులాంటిందన్నారు.
తెలంగాణ భవన్లో సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పోలీసుల మీద నమ్మకం లేదు, ప్రజల ఆస్తులను కాపాడటానికి భారత సైన్యాన్ని దించాలని న్యాయస్థానం వ్యాఖ్యానించిన రోజే సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణను పరిపాలించే నైతిక హక్కును కోల్పోయారన్నారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అధికారులను ఆయన హెచ్చరించారు. ఒక సంస్థ మీద 63 కోర్టు ధిక్కార ఆరోపణలు ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆలోచించాలని సూచించారు.
RS Praveen Kumar | వారి ఉచ్చులో పడకండి
సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి రియల్ ఎస్టేట్ ఉచ్చులో పడొద్దని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధికారులకు సూచించారు. అక్రమ ఆదేశాల్ని తిరస్కరించాలన్నారు. అలా చేస్తే రాజ్యాంగంలోని ఆర్టికల్ 311 కాపాడుతుందన్నారు. స్వామి భక్తితో నాయకులు చెప్పినట్లు చేస్తే తర్వాత జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. మీరు జైలుకు పోతే కుటుంబాలు రోడ్డున పడతాయని హెచ్చరించారు. అనుముల-పొంగులేటి-కాంగ్రెస్ పెద్దల కుటుంబాలకు చీమ కూడా కుట్టదని పేర్కొన్నారు. అధికారులను కోర్టుల ముందు పెట్టి వాళ్లు మాత్రం హాయిగా సేదతీరుతారని పేర్కొన్నారు.
RS Praveen Kumar | చర్లపల్లి జైలుకే..
మంచి పోస్టింగ్ ల కోసం అడ్డదారులు తొక్కితే అధికారులు చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు పరిమితం అయ్యే అవకాశం ఉందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు. 63 కోర్టు ధిక్కరణ కేసులు హైడ్రా కమిషనర్‌పై ఉండటం కాంగ్రెస్ ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రాను రద్దు చేస్తామని కేసీఆర్ ప్రకటించారన్నారు. అంతేగాకుండా కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై చేసిన భూ కబ్జాలపై విచారణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.
ప్రభుత్వ అధికారులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక
రేవంత్ రెడ్డి మాట విని చట్టవ్యతిరేకంగా వ్యవహరించకండి
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్, బీజేపీ కుమ్మకై చేసిన భూ కబ్జాలపై విచారణకు ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం
ఆ విచారణలో భాగంగా ఈరోజు చట్టవిరుద్ధంగా వ్యవహరించే… https://t.co/yDllI0o0aJ pic.twitter.com/RXePe0VDGj
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2026
దీనిని కూడా చదవండి : Student Breakfast Scheme | విద్యార్థులకు అల్పాహారం పథకాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం