Guru Bhakti Shramadan | శ్రమదానంతో గురుభక్తిని చాటుకున్న భక్తులు

ఆశ్రమ పొలంలో భక్తులు శ్రమదానంతో వరినాట్లు వేసి తమ గురుభక్తిని చాటుకున్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్ (వేల్పూర్): Guru Bhakti Shramadan | ఆశ్రమ పొలంలో భక్తులు శ్రమదానంతో వరినాట్లు వేసి తమ గురుభక్తిని చాటుకున్నారు. మండల పరిధిలోని వేల్పూర్ (Velpur) గోవింద గిరి స్వామి (Govinda Giri Swami) దివ్య యోగాశ్రమానికి సంబంధించి సీతారాంపల్లెలోని పొలంలో సోమవారం వెంకటాపూర్ వేంకటేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Guru Bhakti Shramadan | ఉత్సాహంగా వరినాట్లు..

స్వామివారి శిష్యులు, భక్తులు తమ పనులను పక్కనపెట్టి వ్యవసాయక్షేత్రంలో ఉత్సాహంగా వరి నాట్లు వేశారు. ​ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ.. కష్టాన్ని శ్రమ అనుకోకుండా సేవ రూపంలో వరి నాట్లు వేయడం గొప్ప విషయమన్నారు. సేవా భావంతో మెలిగే భక్తులపై గోవింద గిరి స్వామి, జగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. అనంతరం నాట్లు వేసిన భక్తులకు జ్ఞాపికలను అందజేసి, లడ్డూ ప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మెండె పద్మిని-మహేందర్ దంపతులు, కుంట సువర్ణ, వెంకటాపూర్ మల్లవ్వ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *