Prajavani Complaints | ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్​ భుజంగరావు పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Prajavani Complaints | ప్రజావాణి(Prajavani ) ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్​ భుజంగరావు(Bhujanga Rao) పేర్కొన్నారు. కలెక్టరేట్​లో (Nizamabad Collectorate) నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ఫిర్యాదులు స్వీకరించారు.

Prajavani Complaints | 166 ఫిర్యాదులు..

ప్రజావాణికి 166 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. ట్రెయినీ కలెక్టర్ సురేష్, డీఆర్​వో గీత, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్నలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగ్​లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ భుజంగరావు అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

coll1 2

ఇది కూడా చదవండి: తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు 

 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *