Jurala Project Flood | కృష్ణమ్మ పరుగులు.. జూరాలకు పోటెత్తిన వరద

జూరాల ప్రాజెక్ట్​కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. దీంతో విద్యుత్​ ఉత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jurala Project Flood | ఎగువన కర్ణాకటలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానది శ్రీశైలం (Srisailam) వైపు బిరబిర పరుగులు పెడుతోంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్​ జలాశయాలు (Narayanpur Dam) నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

Jurala Project Flood | విద్యుదుత్పత్తి ప్రారంభం

ఎగువ నుంచి వస్తున్న వరదతో గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. జలాశయానికి ప్రస్తుతం 27 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. 16,750 క్యూసెక్కుల అవుట్​ ఫ్లో నమోదు అవుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 318 మీటర్ల మట్టానికి నీరు చేరింది. దీంతో అధికారులు రెండు యూనిట్లలో 78 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీరు శ్రీశైలం వైపు పరుగులు పెడుతోంది.

ఈ సీజన్​తో తెలంగాణలో తొలిసారి విద్యుత్​ ఉత్పత్తి ప్రారంభం అయింది. ఇన్ని రోజులుగా వర్షాలు లేకపోవడంతో జలాశయాలు డెడ్​స్టోరేజీకి చేరాయి. దీంతో జల విద్యుత్​ ఉత్పత్తి చేపట్టే పరిస్థితులు లేక ప్రభుత్వం థర్మల్ విద్యుత్​ ఉత్పత్తిని పెంచింది. తాజాగా కృష్ణానది (Krishna River)కి వరద కొనసాగుతుండటంతో జూరాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగనుంది.

దీనిని కూడా చదవండి : RS Praveen Kumar | హైకోర్టు తీర్పు రేవంత్​రెడ్డికి చెంపపెట్టు : ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *