అక్షరటుడే, వెబ్‌డెస్క్: PoK Election Violence | పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులపై పాకిస్తాన్ ఆర్మీ (Pakistan Army) కాల్పులు జరపడంతో 19 మంది మృతి చెందారు.పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా అక్కడ నిరసనలు తీవ్రరూపం దాల్చాయి.
దీంతో ఆందోళనకారులను అణచివేయడానికి పాక్ సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు సహా 19 మంది చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జేఏఏసీ నాయకుడు సర్దార్ ఉమర్ నజీర్ సోదరుడు ఉస్మాన్ నజీర్ కూడా ఉన్నారు.
PoK Election Violence | మూడు విడతల్లో ఎన్నికల్లు
పీవోకేలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా సోమవారం తొలి విడుత ఎలక్షన్లు జరగా.. ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. సమాహ్ని నియోజకవర్గంలోని రామ్లోహా పోలింగ్ స్టేషన్ ప్రాంతంలో కాల్పులు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC) పిలుపు మేరకు ముజఫరాబాద్‌కు ర్యాలీ నిర్వహిస్తుండగా రావాలాకోట్‌లో నిరసనకారులపై పాకిస్థాన్ బలగాలు కాల్పులు జరిపాయి. PoK అసెంబ్లీలో మొత్తం 53 స్థానాలు ఉన్నాయి – వీటిలో 45 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయి. PoKలో జరుగుతున్న నిరసనలు, ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న ఇస్లామాబాద్ దశాబ్దాలుగా సాగిస్తున్న క్రమబద్ధమైన దోపిడీ, పరిపాలనాపరమైన అణచివేతకు నిదర్శనం అని భారత్ పేర్కొంది.
ఇది కూడా చదవండి..: China Earthquake | చైనాలో వరుసగా భూకంపాలు.. రిక్టర్ స్కేలుపై 5.8 తీవ్రత నమోదు!