అక్షరటుడే, కామారెడ్డి: El Nino Preparedness | ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాలోని అన్ని శాఖలు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
El Nino Preparedness | అధికారులు సంసిద్ధులై ఉండాలి
జిల్లాలో(Kamareddy) నెలకొనే కాలానుగుణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, వివిధ శాఖల సంసిద్ధతపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలసాగుపై అవగాహన కల్పించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. తాగునీరు, విద్యుత్, వైద్యం, పశుసంవర్ధక, పంచాయతీరాజ్ తదితర శాఖలు తమ కార్యాచరణ ప్రణాళికలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. వర్షాభావం లేదా ఇతర ప్రతికూల పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
El Nino Preparedness | జాతీయ రహదారులపై ఆక్రమణలు
అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీతో పాటు జాతీయ రహదారుల అధికారులు, పోలీసు, ఆర్అండ్బీ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో ప్రధానంగా ఎన్‌హెచ్-44, ఎన్‌హెచ్-161 జాతీయ రహదారులపై ఉన్న ఆక్రమణల అంశంపై చర్చించారు. ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదనలను నూతనంగా ఏర్పాటు చేసిన హైవే టాస్క్‌ఫోర్స్ కమిటీ ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అతివేగ వాహనాలపై కఠినచర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ఇందులో భాగంగా ఎన్‌హెచ్-161 రహదారిపై అతివేగంగా వెళ్లే వాహనాలను గుర్తించేందుకు పోలీసు శాఖకు స్పీడ్ లేజర్ గన్స్ అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్-161కు సంబంధించిన పలు రహదారి భద్రత సమస్యలపై కూడా చర్చించి సంబంధిత శాఖలు తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
ఇది కూడా చదవండి: Uday Krishna Reddy Arrest | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్