అక్షరటుడే, వెబ్‌డెస్క్: Balaji Mala IPO | భారతదేశంలోని బీ2బీ కాటన్ చీరల హోల్‌సేల్ విభాగంలో కాటన్ చీరల కాంట్రాక్ట్ తయారీదారుగా, హోల్‌సేలర్‌గా వ్యవహరిస్తున్న శ్రీ బాలాజీ మాలా టెక్స్ టైల్స్ .. బీఎస్ఈ ఎస్ఎంఈ సెగ్మెంట్లో ఐపీవోకు వచ్చింది. “మాలా సారీ” అనే బ్రాండ్ పేరుతో ఈ కంపెనీ ఉత్పత్తులు గుర్తింపు పొందాయి. పూర్తిగా కొత్త షేర్ల జారీ ద్వారా సుమారు రూ. 18.90 కోట్లను సమీకరించే లక్ష్యంతో 27 లక్షల షేర్లను జారీ చేసింది.
Balaji Mala IPO | భారీ స్పందన..
ఈ కంపెనీ ఐపీవో (IPO) సబ్స్క్రిప్షన్ జూలై 22న ప్రారంభమై, జూలై 24న ముగిసింది. దీనికి గ్రే మార్కెట్ ప్రీమియం 80 శాతం ఉండడంతో ఇన్వెస్టర్లనుంచి భారీ స్పందన వచ్చింది. మొత్తం 200 రెట్ల సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లు 277.33 సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు.
Balaji Mala IPO | వెంటనే ప్రాఫిట్ బుకింగ్ ..
శ్రీ బాలాజీ మాలా టెక్స్ టైల్స్ షేర్లు బుధవారం బీఎస్ఈలో లిస్టయ్యాయి. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరును రూ. 70కి విక్రయించగా.. 90 శాతం ప్రీమియంతో రూ. 133 వద్ద లిస్టయ్యాయి. అయితే ఒక్కరోజులోనే సంపద 90 శాతం పెరిగిందన్న ఆనందం ఐపీవో అలాట్ అయినవారిలో లేకుండా పోయింది. లిస్టయిన క్షణాల్లోనే లాభాల స్వీకరణతో షేరు ధర 5 శాతం తగ్గి 126.35 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో కొనేవారు లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు.
ఇది కూడా చదవండి..: Stock Market Rally | ఐటీ సెక్టార్లో దూకుడు.. భారీ లాభాల్లో సూచీలు