CRPF Chief | నిర్భయంగా పని చేయండి.. నేను చూసుకుంటా: సీఆర్​పీఎఫ్​ చీఫ్​

సీఆర్​పీఎఫ్​ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిబ్బంది నిర్భయంగా పని చేయాలని సూచించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CRPF Chief | సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిబ్బంది నిర్భయంగా పని చేయాలని సూచించారు. శాంతి భద్రతలు, దేశ రక్షణ కోసం వారు తీసుకునే నిర్ణయాలకు తాను బాధ్యత తీసుకుంటానని తెలిపారు.

కాక్రోచ్​ జనతా పార్టీ (Cockroach Janata Party) నిరసనల్లో భాగంగా జులై 20న పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీజేపీ, విపక్షాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈ క్రమంలో సీఆర్​పీఎఫ్​ చీఫ్​ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నిరసన సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ పెల్లెట్ గన్‌లను ఉపయోగించిందని విమర్శలు వచ్చాయి.

CRPF Chief | నేను బాధ్యత వహిస్తా..

ఆయన మాట్లాడుతూ.. ఆపరేషనల్ బెటాలియన్ అయినా, శాంతిభద్రతల విభాగం అయినా, మీ విధులను నిజాయితీగా నిర్వర్తించే క్రమంలో మీరు తీసుకునే నిర్ణయాలు మరియు చేపట్టే చర్యలు ఏవైనా సరే, ఆ నిర్ణయాలు మరియు చర్యలన్నింటికీ నేనే బాధ్యత వహిస్తానని సిబ్బందికి భరోసా ఇచ్చారు. విధులను నిర్భయంగా కొనసాగించాలని సూచించారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆందోళనకారులపై RAF సిబ్బంది తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ప్రధాన ఆపరేషన్ తర్వాత వృత్తిపరమైన సమీక్ష నిర్వహించడం అనేది CRPF ప్రామాణిక నిర్వహణ విధానంలో ఒక భాగం. ఈ సమీక్షలో పెల్లెట్ గన్‌లను ఉపయోగించాల్సిన పరిస్థితులు, నిరసనకారులపై చర్య తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తారు.

ఇది కూడా చదవండి..: CJP Protest FIRs | సీజేపీ హెచ్చరిక.. జంతర్ మంతర్ వద్ద భారీ భద్రత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *