అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Family Register Certificate | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ను ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ప్రామాణికంగా తీసుకోకూడదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి (Dinesh Kulachari) పేర్కొన్నారు. ఈ మేరకు నాయకులతో కలిసి గురువారం అడిషనల్ కలెక్టర్ భుజంగరావుకు వినతిపత్రం సమర్పించింది.
Family Register Certificate | హడావుడిగా తేవడంలో మతలబేంది..?
దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25వ తేదీన ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ను హడావిడిగా తీసుకువచ్చిందన్నారు. రేషన్ కార్డుల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ వ్యవస్థను ఏర్పాటు చేసి, మీ సేవా కేంద్రాల ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తామని చెబుతోందన్నారు. కానీ సరిగ్గా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే ఈ కొత్త సర్టిఫికెట్ తీసుకురావడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఇది ముమ్మాటికీ అధికార కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షంమైన ఎంఐఎం (AIMIM) కలిసి దొంగ ఓట్లను నమోదు చేయడానికి పన్నిన వ్యూహమని ఆరోపించారు.
Family Register Certificate | ఈ సర్టిఫికెట్‌ను అడ్డం పెట్టుకుని
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, సీఎం రేవంత్‌రెడ్డికి విన్నవించిన వెంటనే ఈ జీవో రావడం చూస్తుంటే, ఈ సర్టిఫికెట్‌ను అడ్డం పెట్టుకుని భారతదేశానికి చెందని వారిని ఓటర్లుగా చేర్పించుకోవాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఈ ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ను ఒక ప్రామాణిక పత్రంగా ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించకూడదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్కార్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీ నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, చింత శ్రీనివాస్ రెడ్డి, ఓంసింగ్, విజయ్ కృష్ణ, వంశీ గౌడ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనీత, పంచరెడ్డి అనిత, బెల్లాల్ శశాంక్, రమేష్, రాజేశ్వర్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Banswada Stray Dog Safety | కుక్కల బారి నుంచి చిన్నారుల భద్రతకు ప్రత్యేకచర్యలు
Congratulations Shashi, Ur one best writer, Akshara is one best ENews in the India. Ur covered all National and international news
Great 👍 👏👏👏