అక్షరటుడే, వెబ్డెస్క్ : Employee Arrears Release | ఉద్యోగుల బకాయిలకు ప్రభుత్వం మరో రూ. 2 వేల కోట్లు విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తమ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు గతంలో ప్రభుత్వాన్ని కోరారు. 100 రోజుల్లో నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు విడతల వారీగా రూ.6 వేల బకాయిలను చెల్లించింది. గురువారం మరో రూ. 2 వేల కోట్ల నిధులను విడుదల చేశారు. దీంతో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం రూ. 6 వేల కోట్ల బకాయిలను చెల్లించింది.
Employee Arrears Release | మూడు విడతల్లో..
ఉద్యోగుల బకాయిల కోసం మే 29న మొదటి విడతగా రూ. 2,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. జూన్ 30న రెండో విడతగా రూ. 2,000 కోట్లు, మూడో విడత మరో రూ. 2,000 కోట్లు (గురువారం) విడుదల చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విశ్రాంత ఉద్యోగులకు సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా చెల్లించామని పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇతర బకాయిలను క్లియర్ చేస్తామని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
దీనిని కూడా చదవండి : Revanth Reddy | 2034 వరకు నేనే సీఎం : రేవంత్రెడ్డి