Formula E Case | ఫార్ములా-ఈ కేసు.. నాంపల్లి కోర్టుకు హాజరైన కేటీఆర్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Formula E Case | ఫార్ములా-ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లి కోర్టుకు వచ్చారు. ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి బయలుదేరి నేరుగా న్యాయస్థానానికి చేరుకున్నారు. కోర్టు పనులు ముగిసిన వెంటనే, ఉదయం 11:30 గంటలకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన నర్సంపేటకు బయలుదేరనున్నారు.

Formula E Case | కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

కోర్టుకు వచ్చిన సమయంలో కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. తనపై కావాలనే కుట్రపూరితంగా ఈ అక్రమ కేసు బనాయించారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు కేసులు ప్రజా సమస్యలపై తాము చేసే పోరాటాలను ఏమాత్రం నిలువరించలేవని, చివరికి నిజమే గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Formula E Case | అసలు ఈ కేసు ఏమిటంటే..?

నిబంధనలకు విరుద్ధంగా బ్రిటన్‌కు చెందిన ‘ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్ (FEO)’ సంస్థకు రూ. 55 కోట్లు మళ్లించారనే ఆరోపణలతో 2024 డిసెంబర్‌లో ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. సుమారు 15 నెలల పాటు దర్యాప్తు జరిపిన అనంతరం, ఈ సంవత్సరం మార్చిలో కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ రేసుకు స్పాన్సర్‌గా ఉండాల్సిన ‘ఏస్ నెక్స్ట్ జెన్’ సంస్థ తప్పుకోవడంతో, నిబంధనలను పక్కన పెట్టి ఆ భారాన్ని ప్రభుత్వమే మోసేలా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారని దర్యాప్తు బృందం ఆరోపిస్తోంది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు అప్పటి అధికారులైన అరవింద్ కుమార్, బి.ఎల్.ఎన్. రెడ్డిలతో పాటు ఆల్బెర్టో లాంగో, కిరణ్ రావులను నిందితులుగా చేర్చారు. కోర్టు ఈ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాత నిందితులు కోర్టుకు హాజరుకావడం ఇదే మొదటిసారి.

ఇది కూడా చదవండి..: Godavari Flood Alert | గోదావరిలోకి భారీ వరద.. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *