అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Software Employee | అప్పుల బాధలు తాళలేక యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.ఈ ఘటన శుక్రవారం కామారెడ్డిలో చోటుచేసుకుంది.
Kamareddy Software Employee | బాన్సువాడకు చెందిన..
పోలీసులు.. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ (Banswada)కు చెందిన గతక రాజు (30), ఆరేళ్లుగా హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ గేమ్ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం తండ్రి గంగాధర్‌కు పక్షవాతం రావడంతో చికిత్స కోసం దాదాపు రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. ఆ డబ్బును బంధువుల వద్ద అప్పుగా తీసుకున్నారు. అప్పు తీర్చలేకపోతున్నానన్న మానసిక ఒత్తిడితో రాజు చాలాకాలంగా బాధపడుతున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. గురువారం ఉదయం 10:20 గంటలకు కామారెడ్డి రైల్వే స్టేషన్ మూడో ప్లాట్‌ఫాం వద్ద రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రాజుకు వివాహం కాలేదని, ఇంటి బాధ్యతలన్నీ అతడే చూసుకునేవాడని తల్లి లక్ష్మి, అన్న శరత్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఇది కూడా చదవండి..: Sriram Sagar Project | శ్రీరాంసాగర్‌కు ఎగువన భారీవర్షాలు.. క్రమంగా పెరుగుతున్న నీటిమట్టం