అక్షరటుడే, ఎల్లారెడ్డి: Nizamsagar Reservoir | ఎగువన కురుస్తున్న వర్షాలతో కామారెడ్డి జిల్లా (Kamareddy District)లోని చారిత్రాత్మక నిజాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి క్రమంగా వరద వచ్చి చేరుతోంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
Nizamsagar Reservoir | ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం..
నిజాంసాగర్ జలాశయంలో పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.802 టీఎంసీలు) ప్రస్తుత నీటిమట్టం 1,397.57 అడుగులు, 8.936 టీఎంసీలు ఉండగా గతేడాది ఇదే సమయంలో 1,391.32 అడుగులు (4.632 టీఎంసీలు) మాత్రమే ఉంది. సగటున 6,060 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం ప్రాజెక్టులో దాదాపు 4.3 టీఎంసీల నీరు అదనంగా అందుబాటులో ఉంది. ప్రస్తుతం వస్తున్న వరద నేపథ్యంలో కొన్నిరోజుల్లోనే ప్రాజెక్ట్ నిండే అవకాశాలున్నాయి.
Nizamsagar Reservoir | కళ్యాణి ప్రాజెక్ట్..
ఇక నిజాంసాగర్ ప్రధాన కాలువకు నీటిని మళ్లించే కళ్యాణి డైవర్షన్ స్కీమ్ వద్ద ప్రవాహం ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది.ప్రస్తుత ప్రాజెక్టులో నీటిమట్టం 408 మీటర్లు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 409.50 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో/అవుట్‌ఫ్లో 100 క్యూసెక్కుల చొప్పున నమోదు కాగా, వరద గేట్ల ద్వారా ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రధాన కాలువకు ఎలాంటి నీటి మళ్లింపు చేపట్టలేదు.
Nizamsagar Reservoir | సింగితం జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్ట్‌కు..
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో సింగితం జలాశయం నిండుకుండలా మారింది. మంగళవారం జలాశయంలోకి 663 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ నీటిమట్టం పూర్తి స్థాయి మట్టం 416.550 మీటర్లకు గాను 416.050 మీటర్లకు చేరుకుంది. జలాశయానికి వస్తున్న 663 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు యథావిధిగా విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు.
పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పోచారం పొంగిపొర్లుతోంది. ప్రాజెక్టు 5,207 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరడంతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాజెక్టు నిండడంతో పరిసర ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం… pic.twitter.com/mYAfFavrAo
— Akshara Today | Telugu News (@aksharatoday) August 4, 2026
ఇది కూడా చదవండి..: SRSP Water Level | కొనసాగుతున్న వరద.. ఎస్సారెస్పీలో పెరుగుతున్న నీటిమట్టం