Santosh Nagar Steel Bridge |  ప్రారంభానికి సిద్ధంగా స్టీల్​ బ్రిడ్జి.. తప్పనున్న ట్రాఫిక్​ కష్టాలు

హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి. రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన సంతోష్​ నగర్​ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Santosh Nagar Steel Bridge | హైదరాబాద్​ నగరంలో ట్రాఫిక్​ కష్టాలు తీరనున్నాయి. రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన సంతోష్​ నగర్​ స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇది ఓల్డ్​ సిటీకి మరో ఆధునిక మౌలిక సదుపాయాల ఆభరణంగా నిలవనుంది.

Santosh Nagar Steel Bridge | 2.58 కి.మీ పొడవు..

ఈ ఫ్లై ఓవర్​ను సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) త్వరలో ప్రారంభించనున్నారు. 2.58 కి.మీ పొడవైన స్టీల్ ఫ్లైఓవర్​ను నాలుగు లేన్ల కారిడార్​గా నిర్మించారు. ప్రతిరోజూ 1.5 లక్షలకు పైగా వాహనాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా. సంతోష్​నగర్​ – సైదాబాద్​ మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు సమయం ఆదా కానుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి మరియు హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న రవాణా అవసరాలకు అనుగుణంగా దీనిని నిర్మించారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Water Supply | తాగునీటి సరఫరాలో అంతరాయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *