Stock Market Today | స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ ఒడిదుడుకుల మధ్య సాగింది. చివరికి సెన్సెక్స్ 152 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు పెరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Today | ఆర్బీఐ వడ్డీ రేట్లపై యథాతథ స్థితిని కొనసాగించినా.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దీంతో బుధవారం బలంగా ప్రారంభమైన మార్కెట్లు.. హర్ముజ్ జలసంధిని త్వరలో తిరిగి తెరవకపోతే ఇరాన్‌కు చాలా బలమైన దెబ్బ తగులుతుందని ట్రంప్ చేసిన హెచ్చరికతో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి.

Stock Market Today | భారీ లాభాలతో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్ల భారీ లాభంతో ప్రారంభమైనా.. ప్రాఫిట్ బుకింగ్‌తో 770 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 8 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 180 పాయింట్లు కోల్పోయింది. చివరి గంటలో మార్కెట్లు కోలుకుని పైకి ఎగబాకడంతో తిరిగి లాభాల బాట పట్టాయి. చివరికి సెన్సెక్స్ 152 పాయింట్ల నష్టంతో 78,581 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల నష్టంతో 24,624 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Today | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,330 కంపెనీలు లాభపడగా 1,911 స్టాక్స్ నష్టపోయాయి. 207 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 202 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 65 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 16 స్టాక్ లాభపడగా.. 14 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 2.04 శాతం, ఎన్టీపీసీ 1.77 శాతం, ఎస్బీఐ 1.74 శాతం, ఎం అండ్ ఎం 1.73 శాతం, ఇండిగో 1.34 శాతం లాభపడ్డాయి.

Top Losers : టీసీఎస్ 1.23 శాతం, హెచ్సీఎల్ టెక్ 1.12 శాతం, రిలయన్స్ 0.93 శాతం, బీఈఎల్ 0.71 శాతం, సన్‌ఫార్మా 0.56 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: POCO M8 Power 5G | భారీ బ్యాటరీతో పోకో ఫోన్ విడుదల

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *