అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Dial 112 | తెలంగాణ పోలీసులు అత్యాధునిక AI-ఆధారిత ‘డయల్ 112’ అత్యవసర స్పందన వ్యవస్థను ప్రారంభించారు. ప్రస్తుతం పోలీస్ సేవల కోసం డయల్ 100 అందుబాటులో ఉంది. దీని స్థానంలో డయల్ 112ను తీసుకొచ్చారు.
తెలంగాణ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ (TG-ERSS) – డయల్ 112ను తెలంగాణ పోలీసులు బుధవారం ప్రారంభించారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) కొత్త వ్యవస్థను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. అత్యవసర స్పందన వ్యవస్థ దిశగా తెలంగాణ సాగిస్తున్న ప్రయాణంలో ‘డయల్ 112’ ఒక కీలక మైలురాయి అని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులలో పౌరులకు డయల్ 112 మొదటి సంప్రదింపు కేంద్రంగా పనిచేస్తుందన్నారు.
Dial 112 | అన్ని సేవలు ఒకేచోట
ప్రస్తుతం పోలీసుల కోసం 100, అగ్ని మాపక సిబ్బంది 101, అంబులెన్స్ కోసం 108 నంబర్లు అమలులో ఉన్నాయి. ఇక నుంచి పోలీస్, అగ్నిమాపక సేవలు, అంబులెన్స్ సేవలు, మహిళా భద్రత, బాలల రక్షణ, విపత్తు ప్రతిస్పందన, ఇతర అత్యవసర సేవలను ఒకే జాతీయ అత్యవసర నంబర్ 112 ద్వారా పొందవచ్చు. దీని ద్వారా
లొకేషన్-బేస్డ్ సర్వీసెస్, అడ్వాన్స్డ్ లొకేషన్ సర్వీసెస్, గూగుల్ మ్యాప్స్ ద్వారా కాలర్ లొకేషన్‌ను అధునాతనంగా గుర్తించడం చేయవచ్చు. రాష్ట్రంలోని 31 పోలీస్ యూనిట్లలో, 788 కార్లు, 1,072 బైక్‌లతో కూడిన 1,860 పెట్రోలింగ్ వాహనాలను ఈ ప్లాట్‌ఫారమ్‌తో డిజిటల్‌గా అనుసంధానించారు. దీంతో ఎవరైనా కాల్ చేస్తే ఈ సిస్టమ్ సమీపంలో అందుబాటులో ఉన్న పెట్రోలింగ్ వాహనాన్ని స్వయంచాలకంగా గుర్తించి, సిఫార్సు చేస్తుంది. ఫలితంగా వేగంగా సాయం అందించే అవకాశం ఉంటుంది.
ఇది కూడా చదవండి : Bandi Sanjay | ఢిల్లీలో బండి సంజయ్ నివాసానికి ఈటల