Counterfeit Toddy Arrest | కల్తీకల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

ఆల్ప్రాజోలం మత్తు పదార్థంతో కల్తీ చేసిన కల్లును విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Counterfeit Toddy Arrest | ఆల్ప్రాజోలం మత్తు పదార్థంతో కల్తీ చేసిన కల్లును విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు (Kamareddy Police) అరెస్టు చేశారు. ఈ దాడిలో 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు సదాశివనగర్ (sadashivanagar) సీఐ సంతోష్ కుమార్ తెలిపారు.

Counterfeit Toddy Arrest | తాడ్వాయి పోలీసులు ఆధ్వర్యంలో..

విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం తాడ్వాయి ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో పోలీసులు కరడ్‌పల్లి గ్రామంలోని ఓ కల్లు దుకాణంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణంలో ఉన్న విక్రేత సీతూరి అలియాస్​ గౌండ్ల పోచాగౌడ్​ను అదుపులోకి తీసుకున్నారు. దుకాణంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కల్లులో ఆల్ప్రాజోలామ్ కలిపి విక్రయిస్తున్నట్లు అంగీకరించాడు.

అదే సమయంలో అక్కడ కల్లు తాగుతున్న ఇద్దరికి నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో బెంజోడయాజెపైన్ పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చేసిన వైద్య పరీక్షల్లోనూ ఇదే నిర్ధారణ అయింది. దర్యాప్తులో భాగంగా గురువారం దుకాణ లైసెన్స్ హోల్డర్ కొండాపురం స్వామిగౌడ్​ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఎక్కువ లాభాల కోసమే కల్తీకి పాల్పడినట్లు అతను అంగీకరించాడు. పోలీసులు ఈ కేసులో 60 కల్లు సీసాలు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు.

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *