అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: ASI Promotions Nizamabad | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో (Nizamabad Police) పది మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్సైలుగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా శుక్రవారం వారు సీపీ సాయిచైతన్యను (CP Sai Chaitanya) మర్యాదపూర్వకంగా కలిశారు.
ASI Promotions Nizamabad | పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయి..
తనను కలిసేందుకు వచ్చిన ఏఎస్సైలను సీపీ ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదోన్నతులు బాధ్యతలు పెంచుతాయని పేర్కొన్నారు. బాధ్యతతో పోలీస్‌శాఖకు పేరు తేవాలని.. పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.
ASI Promotions Nizamabad | పదోన్నతి పొందిన వారి వివరాలివే..
కె.శంకర్, (ఎడపల్లి), ఎస్.కైలాస్ పతి (వేల్పూర్), బి.చందూలాల్ (ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, నిజామాబాద్), మోజీరాం( ఎన్ఐబీ నిజామాబాద్), పాండు (మోపాల్), ఎ.ముత్తన్న (టాస్క్‌ఫోర్స్ నిజామాబాద్), రాజు (5వ పోలీస్ స్టేషన్ నిజామాబాద్), జి.లక్ష్మణ్ (ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నిజామాబాద్), శ్రీనివాస్ (భీమ్‌గల్, పోలీస్ స్టేషన్ నిజామాబాద్), జీవీ శంకర్ (వర్ని పోలీస్ స్టేషన్), కేసీ.శర్మ (ఏఆర్ఎస్సై)లు ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు.
ఇది కూడా చదవండి : Ganga Gaya Sangam Yatra | గంగా గయ సంగమ యాత్ర.. మరో టూర్ ప్యాకేజీతో ఐఆర్సీటీసీ రెడీ