అక్షరటుడే, కామారెడ్డి: Student Assault Kamareddy | గతేడాది జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని ఓ విద్యార్థిపై తోటి విద్యార్థులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన దమ్మాయిగూడ శ్రీచైతన్య పాఠశాలలో చోటుచేసుకుంది.
Student Assault Kamareddy | కామారెడ్డి పట్టణంలోని..
బాధిత విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి(Kamareddy) పట్టణంలోని స్నేహపురి కాలనీకి చెందిన అభిషేక్ దమ్మాయిగూడ శ్రీచైతన్య పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. అయితే శనివారం రోజు అభిషేక్ మెట్లపై నుంచి పడ్డాడని హాస్టల్ నుంచి ఫోన్ రావడంతో తల్లిదండ్రులు దమ్మాయిగూడ వెళ్లారు. అక్కడికి వెళ్లి చూడగా మెట్లపై నుంచి పడినట్టుగా లేవని, అనుమానం ఉందని, సీసీ పుటేజ్ చూపించాలని వార్డెన్‌ను అడగగా సీసీ పుటేజీ లేదు.. ఏదైనా చేసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని బాధితులు తెలిపారు.
దాంతో అభిషేక్‌ను కామారెడ్డికి తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ.. గత సంవత్సరం రూంలో జరిగిన చిన్నచిన్న గొడవలు మనసులో పెట్టుకుని శుక్రవారం రాత్రి 1 గంటల నుంచి 3 గంటల వరకు సుమారు 12 మంది తోటి విద్యార్థులు తనపై కర్రలు, ప్లేట్లు, చీపురు కట్టలతో పలుమార్లు దాడి చేశారని తెలిపాడు. ఈ విషయం పేరెంట్స్ తో చెప్తే మళ్ళీ ఇక్కడికి వచ్చాక సంగతి చూస్తామని బెదిరించారని పేర్కొన్నాడు. తమ కొడుకుపై విచక్షణ రహితంగా దాడి చేసిన తోటి విద్యార్థులు, ఘటన జరిగినప్పటికీ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తండ్రి కోరాడు.
ఇది కూడా చదవండి: A little more of Rudhra’s world… #Varanasi