అక్షరటుడే, వెబ్‌డెస్క్: Nagarjuna Sagar Varuna Yagam | నాగార్జునసాగర్‌లో సోమవారం (ఆగస్టు 10, 2026) వరుణయాగం నిర్వహించనున్నారు. సాగర్ విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో ఈ యాగాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Nagarjuna Sagar Varuna Yagam | వర్షాలు సమృద్ధిగా కురవాలని..
వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రంలో పంటలు పండాలని, ప్రజలకు సుభిక్షం కలగాలని ఆకాంక్షిస్తూ వరుణయాగాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యాగంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు.
Yellow alert in Telangana : అలెర్ట్..ఆ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు
మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.
సీఎం పర్యటన నేపథ్యంలో విజయ్ విహార్ గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.